: సినిమా అవకాశాల పేరిట టెక్కీ మోసం... అరెస్టు


సినిమాల్లో అవకాశాల పేరిట ఓ యువతిని మోసగించిన టెక్కీని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... చెన్నైకి చెందిన గోకుల్ నాథ్ టీసీఎస్ లో పనిచేస్తున్నాడు. వివాహితుడైన గోకుల్ నాథ్... సంగీతా మోహన్ పేరిట ఓ ఫేస్ బుక్ పేజీ క్రియేట్ చేసి మరో యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఇంటీరియర్ డిజైనర్. తనకు కమల్ హాసన్, శ్రియ వంటి వారితో పరిచయాలున్నాయని, సినీ పరిశ్రమలో చాన్సులిప్పిస్తానని ఆమెకు చెప్పేవాడు. అతడిని పూర్తిగా నమ్మిందా యువతి. చెన్నైలో ఫొటో షూట్ ఉందని, వెంటనే రావాలని ఓరోజు సంగీతా మోహన్ పేరుతో ఫేస్ బుక్ లో సందేశం వచ్చింది. దీంతో, చెన్నై చేరుకున్న యువతిని ఓ వ్యక్తి వచ్చి పరిచయం చేసుకున్నాడు. సంగీతా మోహన్ పంపారని చెప్పాడు. దీనిపై ఆ యువతికి అనుమానమొచ్చి పోలీసులకు సమాచారం అందించింది.

అయితే, ఆధారాలతో సహా పట్టుకునేందుకు ఆమె అతడి వెంట హోటల్ కు నడిచింది. మోడ్రన్ దుస్తుల్లో కొన్ని ఫొటోలు తీయాలని చెప్పిన ఆ వ్యక్తి హోటల్ కు తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. వెంటనే ఆమె పోలీసులను పిలవడంతో వారొచ్చి ఆ మోసగాడిని అరెస్టు చేశారు. విచారిస్తే అతడి పేరు గోకుల్ నాథ్ అనీ, సంగీతా మోహన్ పేరిట ఫేస్ బుక్ పేజీ అతడిదేనని తేలింది. ఇంతకుముందూ అతను ఇలాగే నలుగురు అమ్మాయిలను మోసం చేసినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News