: హైదరాబాదు గ్రీన్ పార్క్ లో మేయర్ల సదస్సు
హైదరాబాదు, బేగంపేటలోని గ్రీన్ పార్కు హోటల్ లో ఈరోజు (శుక్రవారం) ఏడో మేయర్ల సదస్సు జరిగింది. భారత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. మేయర్ల సదస్సులో గ్రేటర్ హైదరాబాదు తరఫున మేయర్ మాజిద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సంయుక్త కార్యదర్శి అనురాధా ప్రసాద్ సదస్సుకు హాజరై ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మాంసపు విక్రయాలు జరపాలని ఆమె సూచించారు. అపరిశుభ్ర వాతావరణంలో మాంసాన్ని అమ్మడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని అనూరాధా ప్రసాద్ అన్నారు.