: కిరణ్ కాన్వాయ్ తగ్గింపు
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ను అధికారులు తగ్గించారు. ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం, రెండు సాధారణ వాహనాలు ఈ రోజు ఆయన ఇంటికి చేరుకున్నాయి. రాష్ట్రపతి పాలన అనివార్యమవడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. గవర్నర్ చేతికి పాలనా పగ్గాలు వెళ్తుండడంతో సీఎం కిరణ్ కు సేవలందించిన భద్రత వాహనాలు, సిబ్బంది గవర్నర్ కు సేవలందించనున్నారు.