: గంటా రాజకీయ వ్యభిచారి: కరణం ధర్మశ్రీ


మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యభిచారి అని విశాఖజిల్లా డీసీసీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ విమర్శించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, గంటా కులం పేరు చెప్పుకుని, కులానికే ద్రోహం చేశారని విమర్శించారు. గంటా టీడీపీలో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో ధర్మశ్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి పీఆర్పీకి, పీఆర్పీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన గంటా మరోసారి కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్తున్నారని, ఇంకే పార్టీ మారతాడో చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News