: ఇక్కడ సీన్ రివర్సైంది!
సినిమా యాక్టర్లు రాజకీయనేతలుగా మారడం తెలిసిందే. కానీ, గుజరాత్ లో సీన్ రివర్సైంది. ఓ శాసనసభ్యుడు సినిమా హీరో అవతారం ఎత్తారు. వివరాల్లోకెళితే... బీజేపీ ఎమ్మెల్యే మధు శ్రీవాత్సవ్ కు సామాజిక స్పృహ కాస్త ఎక్కువే. రైతు పక్షపాతిగా ఈయనకు పేరుంది. అందుకే వారి సమస్యలను ఎత్తిచూపుతూ ఓ సినిమా నిర్మించారు. దాని పేరు 'తకోర్నా కోల్ జగ్మా అన్మోల్'. మార్చి 14న గుజరాత్ వ్యాప్తంగా విడుదల కానుంది. రైతుల భూముల్లో మాఫియా దురాక్రమణ ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ సందేశాత్మక చిత్రంలో ఎమ్మెల్యే గారిదే ప్రధాన పాత్ర. తన సినిమా యత్నంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమిళనాడు సీఎం జయలలిత, ఎన్టీఆర్ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చారని, కానీ ఇక్కడ రాజకీయ నేత కథానాయకుడయ్యాడని చెప్పుకొచ్చారు.