: టీమిండియా బ్యాటింగ్
ఆసియా కప్ నాలుగో వన్డేలో భారత, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో ఛేజింగ్ ను ఇష్టపడే టీమిండియా కెప్టెన్ కోహ్లీ తన జోరును కొనసాగిస్తాడా?, లేక లక్ష్యాన్ని నిర్దేశించడంలో ఎప్పట్లానే భారత్ తడబడుతుందా? అనేది తేలిపోనుంది. యంగ్ టీమిండియా జట్టు తన జోరును కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని ఆటగాళ్లు వ్యక్తం చేశారు. కాగా శ్రీలంక జట్టు గత కొంత కాలంగా నిలకడగా రాణించకపోవడం భారత జట్టుకు కలసివస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్ తో తలపడిన జట్టునే టీమిండియా కొనసాగించనుంది.