: ఐపీఎస్ అధికారిపై వేటు... ఐపీఎల్ ఫిక్సింగ్ పర్యవసానం


ఐపీఎల్ గత సీజన్లో వెలుగుచూసిన ఫిక్సింగ్ స్కాం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో దర్యాప్తు ఆరంభించిన ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. సంపత్ కుమార్ పోలీసు నియమావళికి విరుద్ధంగా వ్యవహరించాడని తమిళనాడు డీజీపీ తెలిపారు. సంపత్ తమిళనాడు కేడర్ ఐపీఎస్ అధికారి. ఈయన గత నెలలో జస్టిస్ ముద్గల్ కమిటీ ముందు హాజరై పలు సంచలనాత్మక వివరాలు వెల్లడించారు.

కెప్టెన్ ధోనీ, గురునాథ్ మెయ్యప్పన్ (బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు)లకు ఫిక్సింగ్ లో భాగస్వామ్యం ఉందని ముద్గల్ కమిటీతో చెప్పారు. తాము కిట్టీ అనే బుకీని విచారించగా ఈ సమాచారం తెలిసిందని వివరించారు. అంతేగాకుండా, ఫిక్సింగ్ అంశం మూలాలు చెన్నైలో ఉండడంపై తమిళనాడు సర్కారు దర్యాప్తు చేయలేదని కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సంపత్ కుమార్ పై తమిళనాడు హోం శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా, ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News