: విచారణకు నాన్న సహకరిస్తారు.. మాపై ఆరోపణలన్నీ వీగిపోతాయి: సీమాంతోరాయ్
సహారా సంస్థ అధినేత సుబ్రతోరాయ్ తనకు తానుగా పోలీసులకు లొంగిపోయారని ఆయన కుమారుడు సీమాంతోరాయ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు తన తండ్రి ఈ నెల 26నే లొంగిపోవాలని ఢిల్లీకి వచ్చారని, అయితే తన నాన్నమ్మ ఆరోగ్యం విషమించడంతో లక్నో తిరిగి వెళ్లారని అన్నారు. తమపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఇవన్నీ సుప్రీంకోర్టులో రుజువవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి పరారయ్యారని కథనాలు ప్రసారం కావడం తమను బాధించిందని సీమాంతో తెలిపారు.