: నేడు భువనగిరిలో 'సోనియమ్మకు సలాం'
నల్గొండ జిల్లా భువనగిరిలో నేడు 'సోనియమ్మకు సలాం' పేరుతో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ధన్యవాదాలు చెప్పేందుకు ఈ సభను నిర్వహిస్తున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ జరగబోతోంది. ఈ సభకు తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణలు హాజరుకానున్నారు.