: రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడి వార్నింగ్


క్రిమియా ప్రాంతంలో రష్యా మద్దతుదారులు పార్లమెంటు వద్ద, ఇతర ప్రభుత్వ భవనాల వద్ద చేపట్టిన తీవ్ర ఆందోళనల పట్ల ఉక్రెయిన్ తాత్కాలిక అధ్యక్షుడు అలెగ్జాండర్ తుర్చినోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేర్పాటువాదులను ప్రోత్సహించడాన్ని నిలిపేయాలని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో రష్యా జోక్యం చేసుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. క్రిమియా పార్లమెంటు, ప్రభుత్వ భవనాలపై సాయుధ ఆందోళనకారులు రష్యా జెండాలు పాతడంపై తుర్చినోవ్ తీవ్రంగా స్పందించారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యకు రష్యా సిద్ధమవుతోందన్న సమాచారం ఉందని, రష్యా తక్షణమే సన్నాహాలు నిలిపేయాలని ఆయన పేర్కొన్నారు. అమెరికా కూడా ఈసరికే రష్యాకు హెచ్చరికలు జారీచేసింది. ఉక్రెయిన్ సంక్షోభంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరించింది. కాగా, ఉక్రెయిన్ నుంచి పరారైన మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ కు ఆశ్రయమిస్తామని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News