: 17 వేల కోట్ల రెవెన్యూ లోటును ఎలా భర్తీ చేస్తారు?: గాలి


సీమాంధ్రలో ప్రతి ఏటా ఏర్పడే 17 వేల కోట్ల రెవెన్యూ లోటును ఎలా భర్తీ చేస్తారని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ను టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కిలోమీటర్ రోడ్డు కూడా వేయని జైరాం రమేష్ మాటలెవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. వచ్చే ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News