: హైదరాబాద్ కార్పొరేటర్లకు ఐపాడ్లు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కార్పొరేటర్లు త్వరలోనే ఆపిల్ ఐపాడ్లు సొంతం చేసుకోనున్నారు. మేయర్ మాజిద్ హుస్సేన్ అధ్యక్షతన నిన్న సమావేశమైన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 155 మంది కార్పొరేటర్లకు ఐపాడ్-4లు, మరో ఐదుగురు కో-ఆప్షన్ సభ్యులకు శాంసంగ్ 3ఎస్ ట్యాబ్లెట్లు అందిస్తారు. ఇందుకు రూ.72 లక్షల 45 వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు.