: గన్ పని చేస్తోందో లేదో పేల్చుకుని పరీక్షించి ప్రాణాలు కోల్పోయిన ప్రేమికుడు


ప్రియురాలికి గన్ పనితీరు ప్రదర్శిస్తూ తనను తానే కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడో ప్రేమికుడు. అమెరికాలోని మిషిగాన్ ఇండిపెండెంట్ టౌన్ షిప్ లో 36 ఏళ్ల వ్యక్తి తన దగ్గరున్న మూడు తుపాకుల గురించి ప్రియురాలికి వివరించి చెబుతూ డెమో చూపించాడు. రెండు తుపాకులతో దూరంగా పేల్చి చూపించిన అతను మూడో గన్ గురించి చెబుతూ తలకు గురి పెట్టుకున్నాడు. ట్రిగ్గర్ దగ్గర వేలు పెట్టి తమాషా చేద్దామనుకున్న ఆ ప్రియుడు అది నిజంగా పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అతని ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News