: సుబ్రతోరాయ్ ని అరెస్టు చేస్తాం: యూపీ పోలీసులు
సహారా సంస్థ అధినేత సుబ్రతోరాయ్ పై సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయన యూపీలో ఉంటే తప్పకుండా అరెస్టు చేస్తామని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. లక్నోలోని ఒక ఆసుపత్రిలో తన తల్లి చికిత్స పొందుతున్నందున న్యాయస్థానానికి హాజరు కాలేకపోతున్నానని సుబ్రతోరాయ్ కోర్టుకు తెలిపారు. పెట్టుబడిదారులకు 20 వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాల్సిన కేసులో ఆయన కోర్టు ఉత్తర్వులను పాటించడంలో విఫలమయ్యారు.