: మీ భావాలు వేరొకరిమీద రుద్దకండి.. అక్బర్ కు సీఎం సలహా
శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అక్బర్ మాట్లాడిన మాటలు దేశమంతా చూసిందన్నారు. మీ భావాలను వేరొకరి మీద రుద్దే ప్రయత్నం చేయకండంటూ అక్బర్ కు సీఎం సలహా ఇచ్చారు. ఓవైసీ సోదరులంటే తనకు గౌరవం ఉందన్నారు. ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు పోదని సీఎం స్పష్టం చేశారు.
కాగా, అక్బరుద్దీన్ శాసనసభలో ప్రసంగిస్తూ, తనపై కుట్ర, దేశద్రోహం కేసులు పెట్టి ప్రభుత్వం ఇరికించే ప్రయత్నం చేస్తోందని, ఎన్నికేసులు పెట్టినా భయపడనని, ముస్లింల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని శాసనసభలో వ్యాఖ్యానించిన నేపధ్యంలో సీఎం పైవిధంగా స్పందించారు.