: నావికాదళాధిపతి రాజీనామా విచారకరం: ఆంటోనీ


నావికాదళాధిపతి డీకే జోషి రాజీనామా విచారకరమని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. అయితే, తన రాజీనామాను త్వరగా ఆమోదించాలని జోషి కోరినట్లు వెల్లడించారు. సింధురత్న ప్రమాదంపై జోషి తీవ్రంగా కలత చెందారని, మొత్తం ఘటనకు తాను బాధ్యత వహిస్తానని తనను విజ్ఞప్తి చేశారని చెప్పారు. కాగా, జోషి రాజీనామాపై తాను ప్రధానమంత్రి, ఇతరులను సంప్రదించాలని చెప్పానన్నారు. అయితే, సింధురత్న ప్రమాదం తర్వాత చాలామంది నావికాదళ అధికారులు రాజీనామాకు సిద్ధపడ్డారని ఆంటోనీ మీడియాకు తెలిపారు. జోషి స్థానంలో వైస్ అడ్మిరల్ రాబిన్ ధావన్ కొత్త నేవీ చీఫ్ బాధ్యత తీసుకుంటారన్నారు. మరోవైపు సింధురత్న జలాంతర్గామి ప్రమాదంపై నావికాదళం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.

  • Loading...

More Telugu News