: పొత్తా.. విలీనమా.. రెండూ కాదా? మార్చి 1న తేల్చనున్న టీఆర్ఎస్
టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం మార్చి 1న జరగనుంది. అదే రోజు పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ సమావేశాలు కూడా జరుగుతాయి. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసై రాష్ట్ర ఏర్పాటు ఖరారైన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనుంది. విలీనానికి కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తున్నా.. పార్టీ కేడర్ నుంచి సొంతంగానే ఎన్నికలకు వెళదామనే సూచనలు వస్తుండడంతో ఏం చేయాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.