: విశాఖను రాజధాని చేయాలని సోనియాను కోరా: కిల్లి కృపారాణి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలని తమ అధినేత్రి సోనియాగాంధీని కోరినట్లు కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖపట్టణమే రాజధానికి అనుకూలమని చెప్పానన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు జరుపుతున్న కేంద్రం పలు విషయాలపై చర్చిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కృపారాణిని పిలిపించి సోనియా నిన్న చర్చించారు.

  • Loading...

More Telugu News