: శంషాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం
మలేషియన్ ఎయిర్ లైన్స్ లో అక్రమంగా తరలిస్తున్న అరకిలో బంగారాన్ని ఈ ఉదయం హైదరాబాదు, శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకు చెందిన అజ్మత్ ఖాన్ అనే ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. అప్పుడే అతడిలో దుస్తులలో దాచి ఉంచిన ఐదు బంగారు బిస్కెట్లను కనుగొన్నారు. వెంటనే అతడిని అరెస్టు చేశారు.