: నేవీ చీఫ్ రాజీనామా.. ఆమోదించిన రక్షణమంత్రి


నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధు రత్న ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే రక్షణ మంత్రి ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయింది. జలాంతర్గామిలో ప్రమాదం జరిగి ఇద్దరు నావికులు గల్లంతవడం, ఏడుగురు గాయపడడం తెలిసిందే. గత కొన్ని నెలలుగా నేవీలో జరుగుతున్న ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ జోషి రాజీనామా చేశారని, దానిని ఆమోదించడం జరిగిందని రక్షణ శాఖ ప్రకటన జారీ చేసింది. వైస్ చీఫ్ ఆర్ కే ధావన్ తాత్కాలిక చీఫ్ గా వ్యవహరించనున్నారు.

  • Loading...

More Telugu News