: రాజకీయ పార్టీలే సమస్యకు మూలకారణం: కిరణ్


రాజకీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోవడమే సమస్యకు మూలకారణమని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సీట్లు, ఓట్ల కోసం రాష్ట్ర భవిష్యత్తును అంధకారంగా మార్చారని తీవ్ర ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ మేరకు హైదరాబాదులో సీమాంధ్ర విద్యార్థులతో సమావేశమైన కిరణ్ పలు విషయాలపై మాట్లాడారు. తాను శాసనసభలో బయటపెట్టినవన్నీ వాస్తవాలేనని, వాటిపై ఎవరి వద్దా సమాధానం లేదన్నారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణలో సాగునీటి రంగానికి నష్టం ఏర్పడుతుందని ఇప్పటికీ చెబుతున్నానన్నారు. విభజన వల్ల సీమాంధ్ర యువత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని కూడా చెప్పానని పునరుద్ఘాటించారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడమంటే ప్రజలను అవమానపర్చడమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నో పార్టీలు వ్యతిరేకించిన బిల్లును ఆమోదించడం దేనికి సంకేతం? అని కిరణ్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News