: రేపు ఒకే వేదికపైకి చిరు, పవన్


చాలా కాలం నుంచి నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి, పవన్ కల్యాణ్ ల మధ్య సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ రేపు ఓ సినీ కార్యక్రమంలో పాల్గొని వేదికపై అభిమానులకు కనువిందు చేయనున్నారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా తెరంగేట్రం చేయనున్న చిత్రం షూటింగ్ రేపు హైదరాబాదులో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి చిరు, పవన్ లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని పలు ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. అయితే ఎప్పటినుంచో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న చిరంజీవి, పవన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వేదికపై మాట్లాడుకుంటారా? లేక పెద్దన్న చిరు వచ్చి వెళ్లాక తీరిగ్గా పవన్ వస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News