: సల్మాన్ కు మరోసారి సర్జరీ అక్కర్లేదు: వైద్యులు


బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి సర్జరీ అవసరం లేదని అమెరికా వైద్యులు స్పష్టం చేశారు. తీవ్ర నరాల సంబంధిత నొప్పితో బాధపడుతూ, అది భరించలేక సల్మాన్ 2011లో చికిత్స కోసం అమెరికా వెళ్లారు. న్యూరాల్జియా సమస్యగా గుర్తించిన వైద్యులు సల్మాన్ కు సర్జరీ చేశారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఆయన మందులు వాడుతూ వచ్చారు. 

ప్రస్తుతం తన ఆరోగ్య స్థితిపై వైద్యుల సలహా కోసం సల్మాన్ అమెరికా వెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఇక సర్జరీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది అభిమానులకు తీపి కబురే!

  • Loading...

More Telugu News