: టీఆర్ఎస్ విలీనానికి కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు: దిగ్విజయ్
కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీ విలీనానికి కేసీఆర్ సంకేతమిచ్చారని.. చర్చలు నడుస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కేసీఆర్ సోనియాతో సమావేశమైనప్పుడు విలీనం అంశంపై మాట్లాడారని దిగ్విజయ్ మీడియాకు తెలిపారు. వాస్తవానికి సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకే తాను కలిశానని, ఎలాంటి రాజకీయ అంశాలు మాట్లాడలేదని కేసీఆర్ అప్పుడు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దిగ్విజయ్ కేసీఆర్ విలీనంపై మాట్లాడారని స్పష్టం చేయడంతో టీఆర్ఎస్ విలీనానికి సముఖంగా ఉన్నట్లు విశిదమవుతోంది.