: 'మోడీ నపుంసకుడు' వ్యాఖ్యలపై ఖుర్షీద్ వివరణ
కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్... బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని నపుంసకుడు అని వ్యాఖ్యానించి సంచలనానికి తెరదీసిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, తాను మోడీ లైంగిక పటుత్వాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, గోధ్రా అల్లర్ల విషయంలో ఆయన చేతకానితనాన్ని ఎత్తిచూపుతూ 'నపుంసకుడు' అన్నానని వివరణ ఇచ్చారు. ఆ పదాన్ని తాను టీవీ చానళ్ళ నుంచే నేర్చుకున్నానని, ఏమీ చేయలేనివాణ్ణి ఆ పదంతో సంబోధించడం తాను విన్నానని తెలిపారు.