: శునకం కంట్లో పడ్డ కనకం!
అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం నిద్ర నుంచి మేల్కొంటోంది. ఆ దంపతులు పెంపుడు శునకంతో అలా వాకింగ్ కు బయల్దేరారు. నడుస్తూ వెళుతున్నారు. వారి శునకం మాత్రం కనిపించిన ప్రతీదాన్ని వాసన చూసి కానీ ముందుకు కదలడం లేదు. అలా వస్తూ వస్తూ దారిలో ఓ చెట్టు దగ్గరే అది ఆగిపోయింది. దంపతులు వెనుదిరిగి చూశారు. శునకాన్ని కమాన్ అంటూ పేరుతో పిలిచారు. కానీ, అది అడుగు కూడా ముందుకు కదలడం లేదు. వారే ఆ చెట్టు వద్దకు వెళ్లి చూశారు. ఓ మూట. తెరచి చూస్తే బంగారు కాయిన్లు పెద్దవి.. 1427 వరకు ఉన్నాయి. అవన్నీ 1847 నుంచి 1,894 మధ్య కాలానికి చెందినవి. వాటి విలువ సుమారుగా కోటి డాలర్లు. అంటే 62కోట్ల రూపాయలన్నమాట!