: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో ఈ రోజు భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది. కాగా భారత జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించనున్నాడు.