: అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుందాం: సీఎం కిరణ్
తెలుగు ప్రజలను ఢిల్లీ పెద్దలు అవమానించారని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో విద్యార్థి సమ్మేళనంలో మాట్లాడుతూ, తెలుగు ప్రజలను పార్లమెంటు సాక్షిగా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలుగు జాతికి తీరని ద్రోహం చేశారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష పార్టీలు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కుయుక్తులతో అందరూ ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేస్తున్న విమర్శలకు విద్యార్థుల నుంచి హర్షద్వానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి.