: పీసీసీ చీఫ్ బొత్స సొంత జిల్లా కేబుల్ ఆపరేటర్లు టీడీపీలోకి జంప్


పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలో ఆయన వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. బొత్సకు విజయనగరం జిల్లా అడ్డా లాంటిది. జిల్లాలో ఆయన కుటుంబం మొత్తం అధికారంలో ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు కాక ముందు ఆయన జిల్లాలో ఏం చెబితే అది శిలా శాసనం అని పేర్కొనే వారు. అక్కడ సిటీ కేబుల్ గా బొత్సకు సంబంధించిన సత్యా విజన్ తిరుగులేని నెట్ వర్క్ గా విరాజిల్లింది. తాజాగా సిటీ కేబుల్ ఎండీ జి.శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. శ్రీనివాసరావు స్వగృహం నుంచి అశోక్ బంగ్లా వరకు ర్యాలీగా వెళ్లి టీడీపీలో చేరారు. సిటీ కేబుల్ ఆపరేటర్లు కూడా టీడీపీలో చేరారు. వీరిని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతి రాజు కండువా వేసి పార్టీలో ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News