: మూడో ఫ్రంటుకు ఓటు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్లే: వెంకయ్యనాయుడు


2014 ఎన్నికల నేపథ్యంలో ఏర్పడబోతున్న మూడో ఫ్రంట్ పై బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు చేశారు. మూడో ఫ్రంటుకు ఓటు వేస్తే పరోక్షంగా కాంగ్రెస్ కు వేసినట్లేనని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలోనే పొత్తులు ఉంటాయని, ఎవరు కలసి వచ్చినా రాకపోయినా బీజేపీ ముందుకు వెళుతుందన్నారు. మోడీ ప్రధాని లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన వెంకయ్య, ఎవరెన్ని కుట్రలు చేసినా మోడీ ప్రధాని కావడం ఖాయమని విజయవాడలో బీజేపీ సీమాంధ్ర జిల్లాల కార్యవర్గం సమావేశంలో స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణానికి ఆర్డినెన్స్ చేయాలని ఒత్తిడి తెస్తున్నామని, సీమాంధ్ర ప్రాంత సమస్యల పరిష్కారం బీజేపీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News