: కాసేపట్లో సీఎం విద్యార్థి సమ్మేళనం ప్రారంభం


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విద్యార్థి సమ్మేళనానికి రంగం సిద్ధమైంది. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన విద్యార్థి సమ్మేళనానికి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల విద్యార్థులు హాజరయ్యేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. విద్యార్థి సమ్మేళనంలో భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున వాహనాలను సమకూర్చారు. ఈ సమ్మేళనంలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు, కొత్త రాజధానిలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై ఆయన విద్యార్థులతో చర్చించనున్నారు.

వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. ఈ సమావేశంలో విద్యార్థులతో నేరుగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చర్చించనున్నారు. రానున్న ఎన్నికల్లో విద్యార్థులు పోషించే పాత్ర ప్రధానం కనుక వారిని ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదీ కాక విద్యార్థులు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాలు పంచుకున్నారు. దీంతో విద్యార్థులను ఆయన ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News