: ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. అనంతరం ఒకటి రెండు రోజుల్లో అత్యంత కీలకమైన టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా?, లేక తమ పార్టీని విలీనం చేయాలా? అనే అంశంపై లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.