: రహ్మాన్ సంగీతంలో కేంద్రమంత్రి ఆల్బమ్
స్వర మాంత్రికుడు ఏఆర్ రహ్మాన్ తో పనిచేయడాన్ని పాటల రచయితలు ఓ అదృష్టంగా భావిస్తుంటారు. ఇప్పుడా అదృష్టం కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ను వరించింది. సాహిత్యంపై మంచి పట్టు ఉన్న సిబాల్ కవితలు రాస్తుంటారు. ఆయన కలం నుంచి జాలువారిన ఏడు గీతాలకు ఇప్పుడు రహ్మాన్ బాణీలు కూర్చారు. ఈ సందర్భంగా సిబాల్ మాట్లాడుతూ, రహ్మాన్ ను ఓ జీనియస్ అని అభివర్ణించారు. తన అక్షరాలు రహ్మాన్ స్వరాలలో ప్రాణం పోసుకుంటాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రస్తుత స్థితిగతులకు తన పాటలు అద్దం పడతాయని మంత్రి తెలిపారు. తాను ఈ గీతాలు రాయగానే, ఎవరి చేతుల్లో పెడితే బావుంటుందో ఆలోచించానని సిబాల్ చెప్పారు. అందుకు రహ్మనే సరిపోతాడని భావించి, బాణీలు కూర్చే బాధ్యతను అతనికే అప్పగించానని వెల్లడించారు.