: తిరిమన్నె సెంచరీ... లంక భారీస్కోరు
ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ లో శ్రీలంక భారీ స్కోరు నమోదు చేసింది. పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ లోని ఫతుల్లాలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 296 పరుగులు చేసింది. ఓపెనర్ లహిరు తిరిమన్నె (102) సెంచరీతో జట్టు భారీస్కోరుకు బాటలు వేశాడు. సంగక్కర (67) జతగా రెండో వికెట్ కు 161 పరుగులు జోడించిన అనంతరం తిరిమన్నె మూడో వికెట్ గా వెనుదిరిగాడు. కెప్టెన్ మాథ్యూస్ 55 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా, పాక్ బౌలర్లలో పేసర్ ఉమర్ గుల్, అఫ్రిది చెరో రెండు వికెట్లు తీశారు.