: ఆకాశం విరిగి భూమి మీద పడుతుందా?: హరీష్ రావు
నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. శాసనసభలో ఆయన సడక్ బంద్ సందర్భంగా జరిగిన అరెస్టులను తీవ్రంగా ఖండించారు. గతంలో రోశయ్య, ఎన్టీఆర్ వంటి వ్యక్తులు కూడా తమ నిరసన తెలిపారన్నారు. బంద్ జరగకుండా ఎందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసిందని ఆయన ప్రశ్నించారు. బంద్ జరిగితే ఆకాశం విరిగి మీద పడుతుందా? అంటూ హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.