: రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్సే దోషి: వెంకయ్య నాయుడు
రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీనే దోషి అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు (మంగళవారం) విజయవాడలో జరిగిన భారతీయ జనతాపార్టీ సదస్సులో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆయనను సన్మానించాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించడంలో తప్పు లేదని, విభజన ప్రక్రియలో కాంగ్రెస్ అనుసరించిన విధానమే తప్పు అని ఆయన అన్నారు. ‘‘దేశాన్ని పదేళ్లు పరిపాలించిన పార్టీ ఇలాగేనా వ్యవహరించేది?’’ అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.