: అక్షరధామ్ ఆలయంపై దాడికి ఐఎమ్ కుట్ర: ఎన్ఐఏ
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎమ్) సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, మరికొంతమంది అరెస్టయ్యాక పలు రహస్య విషయాలు బయటపడుతున్నాయి. కేవలం భారత్ లోని పలు ప్రాంతాలు లక్ష్యంగా దాడికి ప్రణాళికలు రచిస్తున్న వారి విషయాలన్నీ ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణలో వెలుగు చూస్తున్నాయి. అందులో భాగంగానే ఢిల్లీలోని నోయిడాకు దగ్గర్లో ఉన్న అక్షరధామ్ ఆలయం, పూణెలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇండియన్ ముజాహిదీన్ సంస్థ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లు భత్కల్, మరో ముగ్గురిపై ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్ షీటులో పేర్కొంది. భత్కల్, అతని అనుచరుడు అసదుల్లా అక్తర్ నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లలో ఈ విషయాలను సేకరించినట్లు తెలిపింది. గుడికి సంబంధించిన ఫోటోలను కూడా నిందితులు నెట్ లో షేర్ చేసుకున్నారని పేర్కొంది.