: మిస్డ్ కాల్ తో జులాయి నయవంచన
యువతులు, మహిళలు మిస్డ్ కాల్స్ విషయంలో జాగ్రత్తగా లేకుంటే ఎలా మోసపోతారో? చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కర్ణాటకలోని బాగల్ కోట్ కు చెందిన యువతి ఫోన్ కి ఒకరోజు ఒక మిస్డ్ కాల్ వచ్చింది. అది తెలిసిన కాల్ కాదు. పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లాకు చెందిన ఓ జులాయి... అమ్మాయిలకు వల వేయడంలో భాగంగా చేసిన కాల్. తియ్యటి మాటలతో తానొక పెద్ద వ్యాపారినని పరిచయం చేసుకున్నాడు. ప్రేమ మత్తులో ముంచాడు.
ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పగా.. అయితే డబ్బులు తీసుకుని వచ్చేయ్? అని సూచించాడు. రూ.3 లక్షలతో ఆ అమాయక యువతి బెంగళూరుకు వచ్చింది. ఆ వంచకుడు కూడా బెంగళూరుకు వచ్చి ఆమెను తీసుకుని ఢిల్లీలోని ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. ఓ రోజంతా అనుభవించాక.. మరుసటి రోజు బాలిక తండ్రికి ఫోన్ చేసి 10 లక్షలు ఇస్తే మీ అమ్మాయిని అప్పజెబుతా అంటూ బేరాలకు దిగాడు. పోలీసులు మొబైల్ కాల్స్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి ఆ యువతికి విముక్తి కల్పించారు. విచారణలో అతడు ఓ కంపెనీలో కార్మికుడని తేలింది.