: మార్చి 2న కిరణ్ కొత్త పార్టీ
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయింది. మార్చి 2న రాజమండ్రిలో భారీ బహిరంగ సభలో ఆయన కొత్త పార్టీని ప్రకటించనున్నట్టు సమాచారం. అప్పుడే ఆయన పెట్టబోయే పార్టీ పేరు, గుర్తులను కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. అనంతరం పార్టీ రెండో సభను తిరుపతిలో నిర్వహించనున్నట్టు సమాచారం. చివరివరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కిరణ్ ఎంతో ప్రయత్నించారన్న విషయం సీమాంధ్రులకు తెలుసని... ఇదే తమ పార్టీ బలమని కిరణ్ సన్నిహితులు చెబుతున్నారు.