: హస్తిన బయలుదేరిన కాంగ్రెస్ మంత్రులు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిరసనగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో, ఇరు ప్రాంతాలకు చెందిన మంత్రులు అందుబాటులో ఉండాలంటూ ప్రధాని మన్మోహన్ పిలుపునిచ్చారు. దీంతో, కన్నా లక్ష్మినారాయణ, కొండ్రు మురళి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, రాంరెడ్డి దామోదర రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన లగడపాటి రాజగోపాల్ సైతం హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ రోజు 11 గంటలకు వీరు హైకమాండ్ తో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News