: అధిష్ఠానం పిలిచినా కిరణ్ ఢిల్లీ వెళ్లరు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర నేతల భేటీ ముగిసింది. కొత్త పార్టీ ఏర్పాటే ప్రధాన అజెండాగా ఈ సమావేశం సాగింది. వంగా గీత, రౌతు సూర్యప్రకాశరెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. అనంతరం రౌతు మాట్లాడుతూ, అధిష్ఠానం పిలిచినా కిరణ్ ఢిల్లీ వెళ్ళరని స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెట్టాలనే తాము సూచించామని ఆయన వెల్లడించారు. ఇక, వంగా గీత మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరగకూడదనే కిరణ్ పోరాడన్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై సలహాలు తీసుకున్నారని తెలిపారు.