: కేంద్రంపై సోమిరెడ్డి ఫైర్
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్రంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామనడం పచ్చిబూటకమని మండిపడ్డారు. హైదరాబాదులో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందే ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపత్తి విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. గతంలో ఒడిశా, రాజస్థాన్ లకు ప్రత్యేక ప్రతిపత్తి నిర్ణయాన్ని జాతీయ అభివృద్ధి మండలి తిరస్కరించిందని సోమిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రణాళిక సంఘం ప్రత్యేక ప్రతిపత్తి సిఫార్సులను రూపొందిస్తుందని, వీటికి జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మెజారిటీ సీఎంలు అంగీకారం తెలపాల్సి ఉంటుందని వివరించారు.