: సీమాంధ్రకు బుద్ధప్రదేశ్ అని పేరుపెట్టాలి: కత్తి పద్మారావు


సీమాంధ్రకు బుద్ధప్రదేశ్ అని నామకరణం చేయాలంటున్నారు దళిత మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ, తక్షణమే సీమాంధ్రకు లక్ష కోట్ల రూపాయలు కేటాయించాలని, దళితుడిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు. అరకులోయలో గిరిజన యూనివర్శిటీ, రాజమండ్రిలో దళిత యూనివర్శిటీ నెలకొల్పాలని కోరారు. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక, సీమాంధ్ర ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమై కొత్త పార్టీ పెట్టాలని ప్రతిపాదించడం అర్థంలేని విషయమన్నారు.

  • Loading...

More Telugu News