: నేతలను విడుదల చేయాలని సీఎంకు బీజేపీ విజ్ఞప్తి
అరెస్ట్ చేసిన కోదండరాం, శ్రినివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఈటెల, జూపల్లి తదితరులను విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు, నాగం జనార్దన్ రెడ్డితో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సడక్ బంద్ సందర్భంగా వీరిని 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.