: ఆ రోడ్డు అంగన్ వాడీ కార్యకర్తలతో నిండిపోయింది
కనీస వేతనాలు పెంచాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ కార్యకర్తలు ఈరోజు ఇందిరాపార్కు వద్ద ‘మహా ధర్నా’ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో చేరుకున్న అంగన్ వాడీ కార్యకర్తలతో ఇందిరాపార్కు - అశోక్ నగర్ రోడ్డు నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు వైపుగా వెళుతున్న వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ పక్క అంగన్ వాడీల ధర్నా చేస్తున్న ఇందిరాపార్కు వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేశారు. వారిని సచివాలయం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు అశోక్ నగర్ - ఇందిరాపార్కు రోడ్డు నిండిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.