: నేతల వెనుక ఐఐటీ మెరికలు
ఒకప్పుడు ఎన్నికల ప్రచారమంటే ఊరూవాడా మైకుల గోలతో హోరెత్తిపోయేది. మరిప్పుడో... అంతా స్మార్ట్ మయం! సోషల్ మీడియాకు తోడు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రచార సరళే మారిపోయింది. ఆన్ లైన్లో ప్రచారం, ఓట్ రిక్వెస్టులు, నెట్ లో ఒపీనియన్ పోల్స్, ఎక్కడో ఒక చోట కూర్చుని ప్రసంగిస్తే అది ప్రపంచవ్యాప్తంగా స్క్రీన్లపై వీడియోకాస్ట్ అవడం చూస్తున్నాం. మన దేశంలోనూ కొందరు నేతలు సాంకేతిక సౌలభ్యం ఆసరాగా తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. వారిలో ముఖ్యుడు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు ఆయన బాటలోనే నడుస్తున్నారు.
కానీ, వీరందరి వెనుక ఉన్న సాంకేతిక నిపుణులు ఎక్కడివారో అనుకునేరు! దేశంలో నాణ్యమైన సాంకేతిక విద్యనందించే ఐఐటీల నుంచి వచ్చిన మెరికలే ఇప్పుడు నేతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థులు మోడీ బృందంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక మేనేజ్ మెంట్ విద్యార్థులు కూడా ఈ క్రతువులో భాగస్వాములే. కోల్ కతా ఐఐఎమ్ స్టూడెంట్లు, నాయకులు ప్రచార తీరుతెన్నులను నిర్దేశిస్తున్నారు.