: తర్వాత విభజన కాబోయేది యూపీనే: జైరాం రమేశ్


ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందడంతో ఊపిరిపీల్చుకున్న కేంద్ర మంత్రి జైరాం రమేశ్ మరో విభజనపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆంధ్రా తర్వాత విభజన కాబోయేది ఉత్తరప్రదేశేనని చెప్పారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ నాలుగు రాష్ట్రాలు అవ్వొచ్చంటున్నారు. తాజాగా ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన జైరాం పైవిధంగా పేర్కొన్నారు. భవిష్యత్ ప్రభుత్వాలు తప్పకుండా ఉత్తరప్రదేశ్ ను విభజించే ఆలోచన చేస్తాయన్నారు. పెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీని పరిపాలనా సౌలభ్యంకోసం విభజించాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ ఆలోచిస్తుందన్నారు. అయితే, ఇదంతా తన వ్యక్తిగత ఆలోచన అని జైరాం తెలిపారు.

  • Loading...

More Telugu News