: శామ్ సంగ్ స్మార్ట్ వాచ్ ను తలదన్నే హూవే టాక్ బాండ్


శామ్ సంగ్ స్మార్ట్ వాచ్ ను తలదన్నే లుక్స్, డిజైన్, ఫీచర్లతో చైనా మొబైల్ కంపెనీ హువే స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చింది. స్పెయిన్ లోని బార్సిలోనాలో నేడు ప్రారంభమైన ప్రపంచ మొబైల్ ఫోన్ సదస్సులో దీన్ని ఆవిష్కరించింది. ఇది కేవలం 26 గ్రాముల బరువుతో 14.6ఎంఎం మందంతో చూడ్డానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది.

దీనిలో ఉన్న బ్లూటూత్ హెడ్ సెట్ ఆప్షన్ తో నాన్ స్టాప్ గా ఆరు గంటల పాటు మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 2.3, ఐఓఎస్ 5.0 ఆపరేటింగ్ ఆధారంగా పనిచేసే డివైజ్ లతో దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. 1.4 అంగుళాల స్క్రీన్ ఏర్పాటు చేశారు. డిస్ ప్లే భాగాన్ని బయటకు తీసి హెడ్ సెట్ గా వినియోగించునేలా హువే దీన్ని రూపొందించడం అద్భుతం. ఈ టాక్ బాండ్ ను చేతికి పెట్టుకుని మెట్లెక్కినా, నడిచినా ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో కూడా చెప్పేస్తుంది.

దీనిలో టైమ్ కూడా డిస్ ప్లే అవుతుంది. దీనిలో ఉన్న 90 మిల్లీ యాంపీ అవర్స్ బ్యాటరీతో ఆరు రోజుల స్టాండ్ బై టైమ్ ఉంటుంది. రెండే గంటల్లో యూఎస్ బీ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చి నుంచి చైనాలో అందుబాటులోకి రానుంది. మనదేశానికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News