: ఇందిరాపార్క్ వద్ద అంగన్ వాడీల ఆందోళన, ముందస్తు అరెస్ట్


సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు (సోమవారం) హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద అంగన్ వాడీ కార్యకర్తలు ‘మహా ధర్నా’ కార్యక్రమాన్ని చేప్టటారు. అంగన్ వాడీలు ఇవాళ ‘చలో హైదరాబాద్’కు పిలుపునివ్వడంతో ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో, ఇందిరాపార్కు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రం నలుమూలల నుంచి రైళ్లలో, బస్సుల్లో బయల్దేరిన అంగన్ వాడీ కార్యకర్తలు ఈ ధర్నాకు ఇంకా తరలి వస్తున్నారు. కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో నగరానికి చేరుకున్న అంగన్ వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మహా ధర్నాకు వెళ్లకుండా నిలువరిస్తున్నారు.

అంగన్ వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17 నుంచి నిరవధికంగా నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. కార్యాలయాలు మూసివేసి వారు ఆందోళన బాట పట్టారు. కనీస వేతనం పెంపు, అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 11 డిమాండ్లను పరిష్కరించాలని అంగన్ వాడీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News