: రాహుల్, రాష్ట్రపతితో సమావేశం కానున్న కేసీఆర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు రాష్ట్రపతితో సమావేశం అయ్యేందుకు గులాబీ దళపతికి అపాయింట్ మెంట్ లభించింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాతోనూ కేసీఆర్ భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆమె సూచనల మేరకు అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ తో నూ భేటీ అయి చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News